బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయంగా అగ్గి రాజేశారు. ‘కుక్కులు కూడా మీకు ఓటేయవు’ అంటూ.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నాయకులపై ఆయన నోరు చేసుకున్నారు. తాజాగా ‘తెలంగాణ తల్లి’ విగ్రహం రేపిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవితలు.. కాంగ్రెస్ సహా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని వారు దుయ్యబట్టారు. ఉద్యమం జరిగినప్పుడు ఏ తల్లి విగ్రహాన్ని అనుకున్నామో ఆ విగ్రహమే తెలంగాణ తల్లి అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలను తరిమితరిమి కొడతామని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన బీజేపీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్.. సంచలన వ్యాఖ్యలు చేసి.. రాజకీయ రగడకు కేంద్రంగా మారారు. “బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కుక్కలు కూడా ఓటేయవు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, కవితలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. కనీసం డిపాజిట్టు కూడా దక్కదన్నారు. కేటీఆర్ ఇప్పుడు ‘కేవలం ఒక ఎమ్మెల్యే’ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆయన వల్ల ఏమీ జరగదని తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోందని, బీజేపీ ప్రాభవాన్ని ఎవరూ తగ్గించలేరని చెప్పారు.
విగ్రహం ఏర్పాటుతో కాంగ్రెస్-బీఆర్ఎస్ లు రాజకీయాలు చేస్తున్నాయని.. అరవింద్ అన్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా తన ముద్రను ఎవరూ తుడిచేయలేరన్న అరవింద్.. తన రాజకీయాలను ఎవరూ శాసించలేరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు రాజకీయాలు ఎలా చేయాలో తెలుసునని చెప్పారు. “నా బండి నా చేతిలోనే ఉంది. నన్ను ఎవరూ డిక్టేట్ చేయలేరు. చేయాలని అనుకుననా అది అసాధ్యం. సమయాన్ని బట్టి నా బండికి నేనే గేర్ మారుస్తా. అప్పుడే స్పీడ్ మారుతుంది” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. గత కొన్నాళ్లుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో అరవింద్ విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
This post was last modified on December 11, 2024 9:39 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…