తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. విగ్రహం రూపం మార్చడం మూర్ఘత్వపు చర్య అని మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు విగ్రహం రూపం మార్చుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ తో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అన్ని పార్టీల నేతలు వాలని, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ ఒక్క రోజు రాజకీయాలపై కాకుండా తెలంగాణ తల్లి గురించి మాట్లాడదామని, రేపటి నుంచి రాజకీయ అంశాలపై చర్చిద్దామని అన్నారు. కోటి రతనాలు వీణ.. నా తెలంగాణ అని కవి దాశరథి అన్న మాటలు సత్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. జాతి అస్తిత్వమమే గుర్తు అని, ఆ అస్తిత్వానికి మూలం మన సంస్కృతి అని రేవంత్ చెప్పారు. అందుకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనులను ఐక్యం చేసింది ఆ ప్రతిరూపమేనని అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావోద్వేగమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు అధికారిక గుర్తింపు లేదని చెప్పారు.
డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని, 2009లో ఇదే రోజున తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చాని పేర్కొన్నారు. ఉద్యమంలో సబ్బండ వర్గాలను నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి (Telangana Thalli) అని అన్నారు.
నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తున్నామని అన్నారు. మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ (సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందని రేవంత్ అన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండే పంటలతో తల్లి దర్శనమిస్తుందని తెలిపారు.
ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచామని, తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణమని అన్నారు. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పున: నిర్మాణాన్ని తెలుపుతున్నాయని రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.
This post was last modified on December 9, 2024 2:28 pm
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…