వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం దాదాపు పదేళ్లుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ జర్మనీ పౌరుడని, తప్పుడు డాక్యుమెంట్లతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది. తప్పుడు ధృవపత్రాలతో భారతీయ పౌరుడినని కేసును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తంలో రూ. 25 లక్షలను ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని, మరో 5 లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి కావాలని రమేష్ ను కోర్టు ఆదేశించింది. 2009లో తప్పుడు ధృవపత్రాలతో చెన్నమనేని రమేష్ గెలిచారని ఆనాడు ఆయన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత, ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు.
రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని, తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేశారని వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం 2017లో రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత రమేశ్ హైకోర్టును ఆశ్రయించినా కేంద్రం నిర్ణయం మారలేదు. ఆ తర్వాత మరోసారి కేంద్రం నిర్ణయంపై రమేశ్ హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
ఆ తర్వాత జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు రమేశ్ మెమో దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పదేళ్లుగా చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే విచారణ నేడు పూర్తి కాగా…రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్డు కొట్టివేసింది. రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పునిచ్చింది.
This post was last modified on December 9, 2024 3:46 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…