ఒక రికార్డు సృష్టించడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. రికార్డు సృష్టించడం లో ఉన్న శ్రద్ధ.. దీనిని నిలబెట్టుకోవడంలో చూపించడం లేదని, ఈ విషయంలో వైసీపీ నాయకులు విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అనంతపురం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. ఇక్కడి తాడిపత్రి నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా జున్నూరు చంటి(జేసీ) దివాకర్‌రెడ్డి హవా చలాయిస్తున్నారు. 30 ఏళ్లపాటు దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. ఇక, 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
అంటే.. మొత్తంగా జేసీ కుటుంబం 35 ఏళ్లుగా తాడిపత్రిలో చక్రం తిప్పుతోంది. అయితే, వీరి హవాకు గత ఏడాది బ్రేకులు పడ్డాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘన విజయం అందుకున్నారు. నిజానికి ఆయన గెలుపుపై ఆశ పెట్టుకోలేదు. అయితే.. అవుతుంది.. లేకపోతే.. లేదని అనుకున్నారు. కానీ, జగన్ సునామీ .. సహా స్థానికంగా జేసీ వర్గంతో విభేదించిన కొందరి ప్రయత్నంతో పెద్దారెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. ఇంత వరకు బాగానే ఉంది. తాడిపత్రిలో ఏ పార్టీ కూడా సాధించని విజయం అందుకున్నారు. అయితే, దీనిని నిలబెట్టుకునేందుకు, భవిష్యత్తులో మళ్లీ మళ్లీ వైసీపీ జెండాను ఎగిరేలా చేసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించడం లేదనే విమర్శలు వస్తుండడం గమనార్హం.
తాడిపత్రి నుంచి గెలిచిన ఏడాదిన్నరలోనే పెద్దారెడ్డికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. స్థానిక వైసీపీ నాయకులు ఆయనను దూరం పెట్టారు. ఆయన ఏ కార్యక్రమం చేద్దామన్నా.. ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా.. చుట్టపు చూపుగా పలకరించి వెళ్లిపోతున్నారు. దీంతో పెద్దారెడ్డి రాజకీయంగా ఒంటరి అవుతున్నారా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. పెద్దారెడ్డి.. తాడిపత్రిలో విజయం సాధించడం వెనుక.. వైసీపీలోని కీలక నాయకులు ఎందరో సాయం చేశారు. అదేసమయంలో జేసీ వ్యతిరేక వర్గం కూడా ఆయనకు సహకరించిందనే టాక్ ఉంది.
వీరందరికీ కూడా తాను కనుక గెలిస్తే.. పార్టీలో పదవులు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పెద్దారెడ్డి.. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ పదవి ఇప్పించలేదు. పైగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పిస్తానని చెప్పి ఓ కీలక నేతకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదు. మరోపక్క, పెద్దారెడ్డి తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యేగా తన అధికారాలను సైతం ఆయన తన కుమారుడికి అప్పగించారు. దీంతో పెద్దారెడ్డి కుమారుడు.. నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు.
దీంతో వైసీపీ నాయకులుకు పెద్దారెడ్డి చర్యలు రుచించడం లేదు. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని ఆయనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే.. రికార్డు సృష్టించిన పెద్దారెడ్డి.. దీనిని నిలబెట్టుకునే వ్యూహం వేయలేక పోతోందని, ఇదే పరిస్థితి కొన్నాళ్లు కొనసాగితే.. మళ్లీ జేసీ వర్గం పుంజుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 9, 2020 4:04 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…