కాకినాడలో పదిహేనేళ్ల కిందట వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్ ఈజెడ్) వ్యవహారం.. ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. ఎస్ ఈ జెడ్ పరిధిలో వైసీపీ నాయకులు భూములు అక్రమంగా తీసుకున్నారని.. కూటమి లో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. సదరు భూములను వెనక్కి తీసుకోవాలని గత రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారింది.
ఎస్ ఈ జెడ్ పరిధిలో కొన్ని భూములను వైసీపీ నాయకులు బలవంతంగా రాయించుకున్నారని.. జనసేన నాయకులు తొలుత ఆరోపించారు. ఆ తర్వాత.. దీనికి టీడీపీ నేతలు తోడయ్యారు. వైసీపీకి చెందిన కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతకు చెందిన అనుచరులు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆయా భూముల విలువ ఇప్పుడు రూ.కోట్లకు చేరిందని.. ఉద్దేశ పూర్వకంగా భూములు రాయించుకున్న వీరిని అరెస్టు చేయడంతోపాటు.. ఆయా భూములను వెనక్కి తీసుకోవాలన్నది కూటమి నాయకుల డిమాండ్.
ఈ విషయంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే.. ఆ వెంటనే జోక్యం చేసుకున్న కురసాల కన్నబాబు, దాడి శెట్టి రాజా, వంగా గీతలు మీడియా ముందుకు వచ్చారు. తాము అన్ని రుసుములు చెల్లించి కొనుగోలుచేశామని.. దీనిలో అక్రమాలు లేవన్నారు. దాడి శెట్టి రాజా తాను నాలుగు ఎకరాలు కొన్నానని.. తప్పేముందని చెప్పారు. అయితే.. ఎస్ ఈజెడ్‌కు కేటాయించిన స్థలంలో వ్యాపార సముదాయాలు పెట్టేవారు మాత్రమే ముందుకు రావాల్సి ఉంటుంది. ఇతరులు భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు.
ఈ పాయింట్ మీదే.. కూటమి నాయకులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఎన్ వీఎస్ ఎస్ వర్మ(పవన్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు) మీడియా ముందుకు వచ్చారు. స్వలాభం కోసమే.. వైసీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారని.. కాదని నిరూపించాలని ఆయన సవాల్ రువ్వారు. వారి బినామాలతో భూములు కొనుగోలు చేయించారని విమర్శించారు. దీనిపై ఉప్పాడ జంక్షన్‌లో చర్చకు రావాలని ఆయన సవాల్ రువ్వారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తాను అక్కడకు వస్తున్నానని.. దమ్ముంటే.. తప్పు చేయకపోతే.. వైసీపీ నాయకులు రావాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే.. కూటమి ప్రభుత్వం ఎస్ ఈజెడ్‌ను రద్దు చేయాలని సవాల్ రువ్వారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సవాళ్ల విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఇరు పక్షాలను ఉప్పాడ జంక్షన్‌కు రానివ్వబోమని పోలీసు అధికారులు తెలిపారు.
This post was last modified on December 8, 2024 8:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…