దేశం మొత్తంలో మరోసారి ఏపీ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో అత్యుత్తమంగా ప్రదర్శించిన గ్రామాలకు అందజేస్తారు.
అవార్డు పొందిన గ్రామాలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి గ్రామం తాగునీటి అందుబాటులో “సంతృప్తికర తాగునీరు” కేటగిరీలో విజయం సాధించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామం “ఆరోగ్యకర” కేటగిరీలో ఎంపికైంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామం “సామాజిక భద్రత” కేటగిరీలో నిలిచింది.
అంతేకాదు, అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం “పచ్చదనం-పరిశుభ్రత” కేటగిరీలో జాతీయ గుర్తింపు పొందింది. ఈ అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ నెల 11న ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్‌లు మెమెంటోలను అందుకోవడంతో పాటు, రూ. కోటి చొప్పున నగదు బహుమతిని కూడా స్వీకరించనున్నారు.
ఈ గుర్తింపులు ఆయా గ్రామాల్లో సమిష్టి కృషికి ప్రతీకగా నిలిచాయి. గ్రామ అభివృద్ధికి గ్రామస్థుల చొరవ, సర్పంచ్‌ల నాయకత్వం కారణంగా అవార్డులు సాధించగలిగినట్లు తెలుస్తోంది. ఈ గుర్తింపులు రాష్ట్రానికి గర్వకారణమని, భవిష్యత్‌లో మరింత గ్రామ పంచాయతీలు ఇలాంటి గుర్తింపులను పొందాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
This post was last modified on December 8, 2024 9:08 am
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…