Political News

కేసీఆర్ బాటలో రేవంత్ నడుస్తున్నారా?

ఎవరినైతే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ రాజకీయంగా ఎదుగుతారో.. సదరు అధినేత తీరును తాను అనుకరించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. సీఎంగా ఆయన తొలి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న వేళ.. పెద్ద ఎత్తున విజయోత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంంలో కాస్త ఇబ్బంది కలిగించినా.. వాస్తవాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది.

గులాబీ బాస్ కేసీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యమ నాయకుడిగా ఆయన ఎలా వ్యవహరించారు? అధికార అధినేతగా.. ముఖ్యమంత్రిగా పదేళ్ల ఆయన పాలన ఎలా ఉంది? ప్రతిపక్ష నేతగా ఏడాది నుంచి ఆయన తీరు ఎలా ఉందన్న విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగానే ఐడియా ఉంది. మిగిలిన సంగతుల్ని పక్కన పెడితే.. తాను అధికారంలో ఉన్న వేళలో కేసీఆర్ ఎలా వ్యవహరించారో తెలిసిందే. ఎవరికి అందుబాటులో ఉండకుండా ఉండటం.. తాను కోరుకున్న వారికి మాత్రమే తన దర్శన భాగ్యం కల్పించటంతో పాటు.. పార్టీ ముఖ్యనేతలకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం తెలిసిందే.

చివరకు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ కీలక స్థానాల్లో ఉన్న మంత్రులు సైతం తన ఇంటికి వస్తే.. అందులో కొందరికి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిప్పి పంపిన వైనం అప్పట్లో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇలా తాను కోరుకున్న వారిని మాత్రమే తప్పించి.. తనను కలవాలని తపించే వారికి అప్పట్లో కేసీఆర్ ఇంటి ద్వారాలు ఓపెన్ అయ్యేవి కావు. దీనిపై పార్టీ నేతలు మొదలు.. వివిధ రంగాలకు చెందిన వారు తీవ్ర అసంత్రప్తితో ఉండటం కనిపించేది.

కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి సైతం నెమ్మదిగా కేసీఆర్ బాటలో తన నడకను షురూ చేసినట్లుగా చెబుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటితో పోలిస్తే.. ఏడాది పూర్తైన తాజా సందర్భంలో ఆయన తీరు ఎలా ఉందన్నది చూస్తే విషయం అర్థమవుతుంది. ఇప్పటికి సొంత టీంను ఏర్పాటు చేసుకోకపోవటం.. తన పాలనపై విపక్షం విరుచుకుపడుతున్న వేళ.. వారి ప్రచారంలో తప్పుప్పొలను తేల్చేందుకు తగిన టీంను సిద్ధం చేసుకోకపోవటం ఒక మైనస్ గా చెబుతున్నారు.

అన్నింటికి మించి..తనను కలిసేందుకు ఆసక్తి చూపే పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారికి సమయం ఇవ్వకుండా ఉండటం.. గంటల తరబడి చేయించటంతో పాటు.. రోజుల తరబడి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉండటం లాంటివి చేస్తున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. నెమ్మదిగా కేసీఆర్ మాదిరి రేవంత వ్యవహారశైలి మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీకి చెందిన వారిని.. వివిధ వర్గాలకు చెందిన వారిని కలిస్తే.. వారి వినతుల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని.. అందుకే వారిని దూరం పెడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ తరహా తీరును వెంటనే మార్చుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ బాటలో రేవంత్ నడిస్తే.. ఆయనదైన మార్కు పడేది ఎలా? ఆ విషయాన్ని రేవంత్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?

This post was last modified on December 5, 2024 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

2 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

5 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

7 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

8 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

8 hours ago