మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు షిండే సీఎం పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి పెద్దలు భావించడంతో షిండే డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
షిండే తో పాటు అజిత్ పవర్ కూడా రేపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించిన నేపథ్యంలోనే ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు బిజెపి ఎల్పీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఫడ్నవీస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు.
టెక్నికల్ గా తను ముఖ్యమంత్రి అయినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రులు షిండే, అజిత్ పవర్ లతో తాను కలిసి పని చేస్తానని తెలిపారు. రెండున్నర ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ఫడ్నవీస్ ప్రతిపాదించిన విషయాన్ని షిండే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించే అవకాశం తనకు వచ్చిందని షిండే అన్నారు. ఏది ఏమైనా 10 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఈరోజు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయింది.
This post was last modified on December 4, 2024 10:46 pm
ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి…
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈరోజు ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలతో ఈరోజు ఏడడుగులు నడిచాడు.…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…