Political News

‘మ‌త శిక్ష’ అనుభ‌విస్తున్న మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు!!

సిక్కు మ‌త పెద్ద‌లు విధించిన శిక్ష‌ను శిర‌సావ‌హిస్తూ.. పంజాబ్‌లోని స్వ‌ర్ణ దేవాల‌యం ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌.. ద్వార‌పాల‌కుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌పై హ‌త్యా య‌త్నం జ‌రిగింది. న‌డ‌వలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్‌లోనే కూర్చుని ఈ శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. ప‌క్క‌న ఆయ‌న అనుచ‌రులు మాత్ర‌మే ఉన్నారు. గ‌తంలో ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు వివాదాస్ప‌ద‌ డేరా బాబాకు స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

ఈ క్ర‌మంలో సిక్కుల మ‌త పెద్ద‌లు.. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ స‌హా .. అప్ప‌టి ఆయ‌న మంత్రివ‌ర్గాన్ని దోషులుగా తేలుస్తూ.. మ‌తాచారం ప్ర‌కారం.. క‌ఠిన శిక్ష‌లు విధించింది. మ‌ళ్లీ మ‌త పెద్ద‌లు వ‌ద్ద‌ని చెప్పే వ‌ర‌కు ఈ శిక్ష‌లు కొన‌సాగించాలి. ఈ క్ర‌మంలో సుఖ్‌బీర్ సింగ్ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ద్వార‌పాల‌కుడిగా శిక్ష అనుభ‌విస్తున్నారు. చేతిలో ఈటె ప‌ట్టుకుని, మెడ‌లో చేసిన త‌ప్పును పేర్కొంటూ.. రాసిన ప‌ల‌క ధ‌రించి ఆయ‌న శిక్ష‌ను అనుభవిస్తున్నారు.

బుధ‌వారం ఉద‌యం కూడా.. ఇదే విధంగా సుఖ్‌బీర్ శిక్ష‌ను అనుభ‌వించేందుకు వీల్ చైర్‌లో వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చిన గంట అనంత‌రం.. స్వ‌ర్ణ దేవాల‌యానికి.. భ‌క్తుడిగా విచ్చేసిన ఓ 50 ఏళ్ల వ‌య‌సున్న‌ సిక్కు వ్య‌క్తి ఒక‌రు.. సుఖ్‌బీర్‌కు అతి స‌మీపంలోకి వ‌చ్చారు. అయితే.. సుఖ్‌బీర్ స‌మీపానికి వ‌ద్దంటూ.. మాజీ సీఎం అనుచ‌రుడు ఒక‌రు చేయి చూపిస్తున్నా.. నెమ్మది అడుగులో అడుగు వేసుకుంటూ.. అత్యంత ప్రేమ‌గా .. సుఖ్‌బీర్ వైపు న‌కు వ‌చ్చిన స‌ద‌రు వ్య‌క్తి ఒక్క‌సారిగా మొలలో దాచుకున్న తుపాకీని బ‌య‌ట‌కు తీసి కాల్పులు జ‌రిపాడు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌ను ప‌రిశీలిస్తున్న స‌మీపంలోని సుఖ్‌బీర్ మ‌రో అనుచ‌రుడు స‌ద‌రు వ్య‌క్తిని గ‌ట్టిగా అడ్డుకుని ప‌క్క‌కు తోసుకుని వెళ్లిపోవ‌డంతో తూటాలు గాలిలోకి ఎగిరి ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌తో స్వ‌ర్ణ దేవాల‌యంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. మాజీ సీఎంను ఎలాంటి భ‌ద్ర‌తా లేకుండా కూర్చోబెట్టి శిక్ష విధించ‌డం ఏంటంటూ.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు.. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. నిందితుడిని పోలీసుల‌కు అప్ప‌గించారు.

This post was last modified on December 4, 2024 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప 2 ప్రమోషన్ల కోసం ప్రాణం పెట్టిన శ్రీవల్లి!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…

27 mins ago

`సీజ్ ది షిప్‌`: తెలుగు సినిమా టైటిల్ రిజిస్ట్రేష‌న్‌!

`సీజ్ ది షిప్‌` - గ‌త నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్‌` ఇది! ఇటు సోష‌ల్ మీడియాలోనూ.. అటు…

42 mins ago

ప్రభుత్వంపై పోరుబాటకు జగన్ పిలుపు

ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…

55 mins ago

పుష్ప 2 కి షాక్ : బెంగళూరు లో బెనిఫిట్ షోలు రద్దు!

ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…

58 mins ago

“సినిమాని సినిమాలాగే చూద్దాం” – నాగబాబు!

మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…

1 hour ago

ఆ మంత్రి పై బాబు కు మళ్ళీ కోపమొచ్చింది

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారా? మంత్రి వ్య‌వ‌హార శైలిపై…

2 hours ago