వైసీపీ అదినేత, మాజీసీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇదేదో రాజకీయం కాదు.. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తన `బాదుడే-బాదుడు` కార్యక్రమంలో వీక్షించిన చంద్రబాబు.. ఈ మేరకు తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా రు. పులివెందులతో పాటు శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన కారణంగా కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉపశమనం కల్పించారు. ఉద్దానంలోనూ తాగునీటిని అందించే ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం కట్టడి సహా.. జల్ జీవన్ మిషన్ పైనా చర్చించారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరింత మందికి విస్తరించేందుకు(ముఖ్యంగా గిరిజనులకు కూడా) కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మరిన్ని నిర్ణయాలు ఇవీ..
+ హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించింది.
+ ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఓ కే చెప్పింది.
This post was last modified on December 3, 2024 8:27 pm
పదేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్న చిరు.. తిరిగి కెమెరా ముందుకు వచ్చేసరికి పరిస్థితులు చాలా మారిపోయాయి. రీఎంట్రీలో…
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ,…
ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడేందుకు దోహదపడిన సినిమా రఘువరన్ బిటెక్. అనిరుధ్ రవిచందర్ మేజిక్ మొదలయ్యింది కూడా ఇక్కడి…
మరికొద్ది గంటల్లో పుష్ప 2 ది రూల్ సంభవం జరగనుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుష్పరాజ్ భీభత్సం…
2010 లో పోర్కిలో దర్శన్ అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ప్రణిత సుభాష్. అదే సంవత్సరం…
ప్రతిపక్ష వైసీపీ నాయకులు తరచుగా సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆయన చెక్ పెట్టనున్నారు. రాజధానిలో చంద్రబాబుకు సొంత…