రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పది మాసాలే అయిందని.. ఈ పది మాసాల్లోనే అద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష బీఆర్ ఎస్ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలే తమ ప్రభుత్వాన్ని కాపాడాలని కూడా ఆయన సూచించారు. అయితే.. ఇప్పటికిప్పుడు ప్రబుత్వానికి వచ్చిన సమస్య ఏమీలేదన్న ఆయన విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకునే బాధ్యత ప్రజలపైనే ఉందని తెలిపారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి సహకారం కోరుతున్నామన్నారు.
పదేళ్ల దుష్టల పాలనలో వ్యవస్థలు భంగపడ్డాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వాటిని ఇప్పుడు బాగు చేస్తున్నామని తెలిపారు. అయినా.. మరోవైపు ఈ పది మాసాల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అయినప్పటికీ తమ ప్రభుత్వంపై పని గట్టుకుని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇది ఒకరిద్దరితో పోయేది కాదని.. ప్రజలంతా సమైక్యంగా ఉంటూ.. ఈ వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవాలనికోరారు. “మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే” అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
“మా తల రాతలను మార్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పెద్దబాధ్యతలు ప్రజలుఅప్పగించారు. ఇప్పుడు విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని కూడా మీరే తిప్పికొట్టాలి” అని సీఎం రేవంత్ అన్నారు. రైతులను ఘోష పెట్టిన మోడీ.. నల్లచట్టాలు తెచ్చారని, వరి వేస్తే ఉరి తప్పదంటూ.. కేసీఆర్ అప్పట్లో అన్నం పెట్టే రైతులను బెదిరించారని రేవంత్ చెప్పారు. కానీ, ఇప్పుడు వారే.. రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని చెప్పుకొచ్చారు. వీరి మాటలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించామని సీఎం రేవంత్ చెప్పారు. రైతులకు రుణ మాఫీ చేస్తున్నామన్నారు. సన్నాలు పండించే రైతులకు 500 రూపాయల వరకు బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని, తమ హయాంలో ఇప్పటి వరకు 50 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు. అయినా.. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, ఏమీ చేయలేదని వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలని సీఎం రేవంత్ సూచించారు.
This post was last modified on December 2, 2024 10:14 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…