కేతిరెడ్డి పెద్దారెడ్డి 70+, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70+.. ఇద్దరూ సీనియర్ రాజకీయ నేతలే. పైగా తమ తమ నియోజకవర్గాల్లో తాముచెప్పిందే శాసనం అన్నట్టు వ్యవహరించారు. ఈ విషయంలో పెద్దిరెడ్డి సైలెంట్ అయితే.. పెద్దారెడ్డి ‘పుష్ప’ టైపు! కానీ, ఇద్దరూ కూడా చాపకింద నీరులా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వారే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి.. మంత్రి కూడా. దీంతో ఆయనకు చిత్తూరు వ్యాప్తంగా తిరుగులేకుండా పోయింది.
ఇక, పెద్దారెడ్డికి మంత్రి పదవి దక్కలేదు కానీ.. ఆయన అప్రకటిత మంత్రిగానే అనంతపురంలో రాజకీయాలు చేశారు. నిజానికి అప్పటి వైసీపీ నాయకులు జిల్లాను విభజించుకుని పాలించారని చెప్పడంలోనూ సందేహం లేదు. దీంతో నిత్యం పెద్దారెడ్డి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇక, పెద్దిరెడ్డి పైకి మౌనంగా ఉన్నా.. తెరవెనుక ఆయన సైన్యం పెద్దది. దీంతో ఆయన కనుసైగలతోనే కథను నడిపించేశారు. ఆయన దెబ్బకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న(తర్వాత మంత్రి) రోజా కన్నీరు మున్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే.. కథ ఎప్పుడూ పాజిటివ్‌గానే సాగిపోదు కదా! తాజా ఎన్నికల్లో పెద్దారెడ్డికి ప్రజలు శ్రీముఖం చూపించారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక, పెద్దిరెడ్డి పుంగనూరులో అతి కష్టం మీద విజయం దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు ఇద్దరి పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్‌గా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇద్దరూ కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇద్దరిపైనా స్థానిక అధికారులు ఆంక్షలు విదించారు.
పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా.. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి మూడు మాసాలైంది. దీనిపై ఆయ న న్యాయ పోరాటం చేయాలనిఅనుకున్నా.. నిపుణుల సూచనల మేరకు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తాడి పత్రికి కడు దూరంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉంటూ.. అప్పుడప్పుడు.. అనుమతి తీసుకుని తాడిపత్రి లోని ఇంటికి వస్తున్నారు. ఇక, పెద్దిరెడ్డి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత నియోజకవర్గం లోకి ఆయన వెళ్లరాదంటూ.. కలెక్టర్ ఆదేశించి మూడు మాసాలైంది. దీనిపై ఈయన మాత్రం న్యాయపో రాటంచేస్తున్నారు. కానీ, కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇద్దరూ కూడా.. సేమ్ టు సేమ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొంటుండడం గమనార్హం.
This post was last modified on December 1, 2024 6:48 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…