తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లగచర్ల రైతుల ఆందోళన, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రుణ మాఫీ అంటూ రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని, రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసని చెప్పారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జిల్లా అభివృద్ధికి భూసేకరణ అవసరమని, అధికారులను కొడితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని అన్నారు. కేసీఆర్ కు గజ్వేల్‌లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని, కేటీఆర్, హరీశ్‌రావుకు పెద్దపెద్ద ఫామ్‌హౌస్‌లున్నాయని విమర్శించారు. వారు ప్రజలను రెచ్చగొట్టి కేసుల పాల్జేసి ఫామ్‌హౌస్‌లో ఉంటారని విమర్శలు గుప్పించారు.
గత ఏడాది నవంబర్ 30న…సరిగ్గా ఇదే తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూల్చారని గుర్తు చేసుకున్నారు. మూడేళ్లు నిండకుండానే కాళేశ్వరం కూలిందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సాగుకు ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ దేనని తెలిపారు. పాలమూరును ఎవరో దత్తత తీసుకుంటానని ప్రకటించారని, ఈ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అనలేదా అని నిలదీశారు.
కావాలంటే ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అయినా ఇస్తామని, మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధి కోసం పాలమూరు బిడ్డలు ముంబై, హైదరాబాద్‌కు వలసలు పోయే పరిస్థితి ఉందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత… ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తుచేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు.
This post was last modified on November 30, 2024 9:41 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…