Political News

లోకేశ్ తో మంచు విష్ణు భేటీ

ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తో ‘మా’ అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు భేటీ అయ్యారు. సోదరుడు, డైనమిక్ మినిస్టర్ లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇద్దరం పలు అంశాలపై చర్చించుకున్నామని విష్ణు చెప్పారు. ఇద్దరి మధ్య చర్చ ఫలప్రదంగా జరిగిందని అన్నారు. లోకేశ్ సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అని విష్ణు కొనియాడారు. లోకేశ్ కు భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నానని విష్ణు ట్వీట్‌ చేశారు.

‘మా’ అధ్యక్షుడి హోదాలో ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణ, షూటింగులు, ఫిల్మ్ టూరిజం వంటి విషయాలపై లోకేశ్‌తో విష్ణు చర్చించారని తెలుస్తోంది. ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి విష్ణు, లోకేశ్ చర్చించారట. అయితే, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలతోపాటు వారి మధ్య రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయని టాక్ వస్తోంది.

ఇండస్ట్రీ తరఫున లోకేశ్ తో భేటీ అయితే ఇండస్ట్రీకి చెందిన మరికొందరు పెద్దలు కూడా వచ్చి ఉండేవారని, ఇది రాజకీయ భేటీ కాబట్టి విష్ణు సోలోగా కలిశారని ఇండస్ట్రీలోని కొందరు అంటున్నారు. వైసీపీతో మంచు ఫ్యామిలీకి గ్యాప్ వచ్చిన నేపథ్యంలో టీడీపీకి దగ్గర కావాలన్న ప్రయత్నంలో భాగంగానే లోకేశ్ తో విష్ణు భేటీ అయ్యారని మరో ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికలకు ముందు మంచు కుటుంబం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరకపోయినా మోహన్ బాబు అనేక అంశాల్లో జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు. అయితే, రాజ్యసభ సీటు ఆశించిన మోహన్ బాబు భంగపాటుకు గురికావడంతో ఆయన పార్టీకి దూరం జరిగారని ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే ఎన్నికలకు ముందే వైసీపీకి మంచు కుటుంబం దూరమైంది. ఈ క్రమంలోనే లోకేశ్‌ను మంచు విష్ణు కలవడం చర్చనీయాంశమైంది.

This post was last modified on November 30, 2024 4:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago