ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇది ఆయనకు అధికారం లోకి వచ్చిన తర్వాత తొలి పర్యటన. ఈ ఏడాది జూన్‌లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పవన్ రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా.. వాటికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో కలిసి కూడా పవన్ వెళ్లారు. అయితే.. వాటికి, ప్రస్తుతం జరుగుతున్న పర్యటనకు సంబంధం లేదు. తాజాగా మాత్రం ఆయన ఒంటరిగానే.. డిప్యూటీ సీఎం హోదాలో, పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగానే ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
దీంతో ఈపర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేంద్రం పెద్దలతో పవన్ చర్చించారు. వెళ్తూ వెళ్తూనే ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి పాటిల్ సహా.. పర్యాటక శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ అయ్యారు. అనేక సమస్యలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న పలు విషయాలను కూడా ఆయన చర్చించారు.
ఈ క్రమంలో గోదావరి జిల్లాలతోపాటు చుట్టుపక్కల జిల్లాలకు కీలకమైన అఖండ గోదావరి, గండి కోట ప్రాజెక్టుల అభివృద్దికి మార్గం సుగమం చేసుకున్నారు. పర్యాటక, కేంద్ర జలశక్తి మంత్రులకు ఆయా వివరాలను వెల్లడించిన రోజే అనూహ్యంగా కేంద్రం నుంచి రూ.172.34 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది. దీనిలో తొలి విడతగా 114 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం. ఈ నిధులతో ఆయా ప్రాజెక్టులు పరుగులు పెట్టనున్నాయి.
ఇక, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేవన్న విషయాన్ని కూడా పవన్ కల్యాణ్.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం అమలు చేస్తున్న జల్ జీవన్‌మిషన్ ద్వారా.. నిధులు ఇవ్వాలని కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్పడం గమనార్హం. అదేవిధంగా కీలకమైన ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం సహా.. ఈ దుంగలు ఎక్కడ దొరికినా అవి ఏపీకి చెందినవిగా ప్రకటించాలని కూడా కోరారు. దీనికి కూడా కేంద్రం ఓకే చెప్పడంగమనార్హం. మొత్తానికి ఫస్ట్ టూర్‌లో నే పవన్ సక్సెస్ కావడం గమనార్హం.
This post was last modified on November 28, 2024 10:44 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…