అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఉద్దేశించి కామెంట్ విసరడం, ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీని ఏకవచనంతో బూతు అర్థం వచ్చేలా పిలవడం సోషల్ మీడియాలో చాలా వైరలయ్యాయి. ఇక్కడ చెప్పింది రెండు ఉదాహరణలే కానీ ఇంకా బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
తాజాగా ఒక ఈవెంట్లో కాంతారావుని పొగిడే క్రమంలో తమిళ లెజెండరీ నటులు ఎంజిఆర్ ని కాస్త అభ్యంతరకర భాషలో తగ్గించి రాజేంద్రప్రసాద్ మాట్లాడ్డం వివాదానికి దారి తీస్తోంది. కత్తివీరుడు కాంతారావునిం చూసి ఎంజిఆర్ తెగ భయపడేవాడని, బిజినెస్ మెన్ లో మహేష్ బాబు బ్రహ్మాజీకి వార్నింగ్ ఇచ్చిన రేంజ్ లో పోల్చేసరికి అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి ఆ కంపారిజన్ అవసరం లేదు.
ప్రాక్టికల్ గా మాట్లాడితే ఎంజిఆర్ చూసిన ఎత్తులు, అందుకున్న శిఖరాగ్రం కాంతారావు చేరుకోలేదు. దేవుడిగా కొలవబడలేదు. ఇప్పటికీ ఎంజిఆర్ ఫోటో వాడుకుని సినిమాలు తీసే దర్శకులు ఉన్నారు. కార్తీ వా వాతియర్ ఆ కోవలోకే వస్తుంది. కానీ మనకు ఎన్టీఆర్ ఎలాగో తమిళులకు ఎంజిఆర్ అలాగన్న మాట. తమిళనాడులో మనం చూసే స్థానిక పార్టీల రాజకీయ అధిపత్యానికి ఆద్యులు ఎంజిఆరే.
అలాంటిది ఎంజిఆర్ ని కాంతారావుతో పోలుస్తూ అంత మాట అనేసరికి కోలీవుడ్ మూవీ లవర్స్ భగ్గుమంటున్నారు. పద్మశ్రీ వచ్చిన వేళ నటకిరీటి ఇలా స్లిప్ కావడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. వయసు ప్రభావం కావొచ్చు వేరే ఏదైనా కారణం కావొచ్చు, పదే పదే ఇలా దొరికిపోవడం ఆయన వయసు, అనుభవానికి సరికాదు.
మనం మనం వంద అనుకుని సారీలు చెప్పుకోవచ్చు. అదేం తప్పు కాదు. కానీ మనకు సంబంధమే లేని ఎంజిఆర్ ని తీసుకొచ్చి చులకన చేయడమే బాలేదు. కాంతారావు అద్భుతమైన ఆర్టిస్టు. అందులో సందేహం లేదు. ఆయన సినిమాలు, వేసిన గొప్ప పాత్రల గురించి పొగడాల్సింది పోయి ఇలా కాంట్రావర్సీ చేసుకోవడం ఏమిటో.
This post was last modified on March 10, 2026 3:42 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…