వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో లోకేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’ గా మారుస్తున్నామని లోకేష్ చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మంది సభ్యులతో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ కమిటీల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లకు కూడా చోటు కల్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనేక దారుణాలకు గంజాయి, డ్రగ్స్ మత్తు కారణమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం అరికట్టేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈగల్ తో గంజాయి, డ్రగ్స్ పై నిఘా పెంచాలని భావిస్తోంది.
This post was last modified on November 27, 2024 7:12 pm
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
మాళవిక మోహనన్.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ…