ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ మర్యాపూర్వకంగా విందుకు ఆహ్వానించారు. జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ కుమార్ లతో కలిసి ఉప రాష్ట్రపతి ఇచ్చిన విందుకు పవన్ హాజరయ్యారు.
మరోవైపు, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో 7వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని నిర్మలా సీతాారామన్ కు పవన్ వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్యపూరితంగా వ్యవహరించి ఏఐఐబీకి మ్యాచింగ్ గ్రాంట్స్ చెల్లించలేదని, దీంతో, గడువు ముగిసిందని అన్నారు. కాలపరిమితిని రెండేళ్లు పెంచాలని లేదంటే 90 శాతం నిధులు ఏఐఐబీ నుంచి ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు.
ఇక, టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై షెకావత్ తో మాట్లాడానని పవన్ చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోనుగా మార్చినందుకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకం (MGNREGS)లో భాగంగా చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్ ను పెంచడం, రూ.2081 కోట్ల కూలీల వేతన సొమ్ము విడుదల చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని, అయితే పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని కేంద్ర మంత్రి దృష్టికి పవన్ తీసుకువెళ్లారు. పవన్ రెండో రోజు పర్యటలో భాగంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు.
This post was last modified on November 27, 2024 2:36 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…