ఇప్పటి వరకు వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో జోగి రమేష్ సహా నందిగం సురేష్(ప్రస్తుతం జైల్లో ఉన్నారు) వంటి ఫైర్ బ్రాండ్‌నాయకులు ఉన్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీ టార్గెట్.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు బ్రదర్స్ కావడం గమనార్హం. వీరిని ఈ రోజు లేదా రేపు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.
ఏం జరిగింది?
2022, నంబరు 4న అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. వైసీపీ హయాంలో ధరలు మండిపోతున్నాయని పేర్కొంటూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 2022, నవంబరు 4న ఆయన ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. రాత్రం 7 గంటల సమయంలో నందిగామ జంక్షన్‌తో ప్రసంగించేందుకు రెడీ అయ్యారు.
ఖచ్చితంగా ఇదే సమయంలో బాబు కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో చంద్రబాబు భద్రతా సిబ్బందికి నేతృత్వం వహిస్తున్న అధికారికి తీవ్రంగా గాయమైంది. అప్పట్లోనే దీనిపై కేసు నమోదైనా.. వైసీపీ అనుకూల వ్యక్తులు దీని వెనుక ఉన్నారన్న కారణంగా కేసు ముందుకు సాగలేదు. అయితే.. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసును తిరగదోడారు. దీనిలో భాగంగా పోలీసులు ప్రత్యేకంగా దీనిని చేపట్టారు.
ఈ మొత్తం దాడి ఘటన నందిగామలోని వైసీపీ కార్యాలయంలో పురుడు పోసుకుందని, అక్కడే ప్లాన్ చేశారని, మొండితోక బ్రదర్స్ హస్తం ఉందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే 15 మందని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కూపీ లాగుతున్నారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా మొండితోక బ్రదర్స్‌ను ఈ రోజు లేదా రేపటిలోగా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బ్రదర్స్ జాడ లేకుండా పోవడం గమనార్హం.
This post was last modified on November 27, 2024 11:27 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…