తాజాగా ముగిసిన ఐపీఎల్-2025 వేలంలో అంతర్జాతీయ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరున్న వార్నర్, బెయిర్ స్టో వంటి వారిని సైతం అన్ని ఫ్రాంచైజీలు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో టాలెంట్ ఉన్న యువ క్రీడాకారులకు దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2025 వేలంలో ఆంధ్రా క్రికెటర్లు ఐదుగురు సత్తా చాటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్ వేలంలో విశాఖపట్నానికి చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది. ఇక, విశాఖపట్నానికి చెందిన మరో క్రికెటర్ పైల అవినాష్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అదే క్రమంలో గుంటూరుకు చెందిన యంగ్ సెన్సేషన్ షేక్ రషీద్‌ను రూ. 30 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో కూడా రషీద్ ను చెన్నై కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇక, శ్రీకాకుళానికి చెందిన స్పిన్నర్ త్రిపురణ విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జట్లకు సెలక్ట్ అయిన ఈ ఐదుగురు ఆంధ్రా ఆటగాళ్లకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ క్రికెట్ లో దేశం తరఫున ఆడి రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని లోకేష్ ఆకాంక్షించారు. క్రికెట్ పట్ల ఆ ఆటగాళ్ల అంకిత భావం, కఠోర శిక్షణ, కష్టపడేతత్వం వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకున్నారు.
This post was last modified on November 26, 2024 9:41 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…