ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం తాజాగా షెడ్యూల్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఏపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, హరియాణాలు ఉన్నాయి. మొత్తం 6 స్థానాలకు గాను విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 2 స్థానాలు, ఒడిశాలో 1 స్థానం, పశ్చిమ బెంగాల్‌లో 2, హరియాణలో ఒక స్థానం ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీలో రెండు స్థానాలను గమనిస్తే.. రెండు కూడా వైసీపీకి చెందిన స్థానాలే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రెండు మాసాల కిందట వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు తమ రాజ్యసభ స్థానాలకు కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఏపీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి బలం ఎక్కువగా ఉన్నందున ఆపార్టీలకే దక్కనున్నాయి. అయితే.. తాజాగా రాజీనామా చేసిన వచ్చిన మోపిదేవి, బీదలకే రాజ్యసభ సీట్లు ఇస్తారా? లేక వేరేవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉండడం గమనార్హం.
ఇదీ షెడ్యూల్..నోటిఫికేషన్ విడుదల: డిసెంబరు 3నామినేషన్లకు గడువు: డిసెంబరు 10నామినేషన్ల పరిశీలన: డిసెంబరు 11పోలింగ్ డేట్: డిసెంబరు 20ఓట్ల లెక్కింపు: అదే రోజు
This post was last modified on November 26, 2024 3:05 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…