ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా ఆ పదవిని స్వీకరించారు. ఈ నెల నుంచే బాధ్యతలు తీసుకోవాలన్న సీఎం చంద్ర బాబు సూచనల మేరకు ఆయన కార్యరంగంలోకి దిగారు. వచ్చే ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారిలో ఆత్మ స్థయిర్యం నింపేందుకు, పరీక్షల విషయంలో వారు మానసిక ఆందోళన లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసేలా ప్రోత్సహిం చేందుకు ఈ నెల నుంచే నైతిక విలువలను విద్యార్థులకు బోధించాలని చంద్రబాబు సూచించారు.
ఈ క్రమంలో తాజాగా సోమవారం కాకినాడ నుంచి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావు.. సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా చాగంటిని శాలువా, మొమెంటోతో సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. అనంతరం 45 నిమిషాల పాటు ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. ఏయే అంశాలపై విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇవ్వాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విద్యార్థులను మౌల్డ్ చేయాలని సీఎం సూచించారు. అదేవిధంగా మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని పేర్కొన్నారు.
అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ కృషి చేయాలని చాగంటికి సీఎం చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని తెలిపారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మనకు ఉన్నాయన్న చంద్రబాబు.. ఈ తరానికి, భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని కోరారు.
మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలని సూచించారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
This post was last modified on November 25, 2024 6:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…