Political News

ఏపీ రాజ‌ధానిలో తొలి ప్రైవేటు నిర్మాణం.. బాల‌కృష్ణ ఆసుప‌త్రికి శ్రీకారం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖ‌రారైనట్టు తెలిసింది. రాజ‌ధాని ప్రాంతంలో 2015-17 మ‌ధ్య న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాల‌కృష్ణ ఆధ్వ‌ర్యం లోని బ‌స‌వ తార‌కం ఇండో-అమెరిక‌న్ కేన్స‌ర్ ఆసుప‌త్రి నిర్మాణానికి అప్ప‌టి టీడీపీప్ర‌భుత్వం భూమిని కేటాయించింది. దీంతో అప్ప‌ట్లో లీజుకు సంబంధించిన సొమ్మును బాల‌య్య చెల్లించారు. కానీ, ప‌నులు చేప‌ట్టే స‌మ‌యానికి వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది.

ఇక‌, మూడు రాజధానుల పేరుతో కాల‌యాప‌న చేయ‌డంతో అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే బాల‌య్య ఆసుప‌త్రి నిర్మాణం ప‌నులు కూడా నిలిచిపోయాయి. ఐదేళ్ల త‌ర్వాత‌.. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నేప‌థ్యంలో అమ‌రావ‌తి నిర్మాణాల‌పై స‌ర్కారు దృష్టి పెట్టింది. కేంద్రం సాయంతో రూ.15 వేల కోట్లు, సొంత‌గా మ‌రో 12 వేల కోట్లు, నాబార్డు ద్వారా మ‌రో 15 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకుని రాజ‌ధాని నిర్మాణాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా బాల‌య్య కూడా త‌న ఆసుప‌త్రి నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఆదివారం ఆయ‌న రాజ‌ధానిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డ త‌మ బ‌స‌వ తార‌కం ఇండో-అమెరిక‌న్ ఆసుప‌త్రికి కేటాయించిన భూముల‌ను ప‌రిశీలించారు. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలో జంగిల్ క్లియ‌రెన్స్ చేసిన నేప‌థ్యంలో ప‌నులు చేప‌ట్టేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించాయి.

ఈ క్ర‌మంలోనే అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబందించిన స్థలాన్ని సిఆర్డిఏ అధికారులుతో కలిసి పరిశీలించిన నందమూరి బాలకృష్ణ‌.. త్వరలో హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా సిఆర్డిఏ అధికారులతో చర్చలు జరిపారు. కేన్సర్ వైద్యం అందరికి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో బసవతరకం కేన్స‌ర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. కాగా, ఈ నిర్మాణం ఈ నెల చివ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిసింది ఇదే జ‌రిగితే.. అమ‌రావ‌తిలో ఏర్ప‌డే తొలి ప్రైవేటు నిర్మాణం ఇదే అవుతుంది.

This post was last modified on November 24, 2024 7:08 pm

Share

Recent Posts

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

22 minutes ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

1 hour ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

5 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

6 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

7 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

7 hours ago