ఏపీకి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ప్రధాని మోడీ ఏపీకి రావడం ఇదే తొలిసారి. అప్పట్లో కూటమి ఎన్నికల ప్రచారం నిమి త్తం పలు ప్రాంతాల్లో మోడీ పర్యటించారు. ఎన్నికల ప్రసంగాలు సైతం చేశారు. గుంటూరు, రాజమండ్రి, విశాఖల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. విజయవాడలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇక, కూటమి సర్కారు ఏర్పడిన సమయంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో ఒకసారి పాల్గొన్నారు. అప్పటి కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని మోడీ సహా అనేక మంది హాజరయ్యారు. ఆ తర్వాత.. ఎప్పుడూ ఏపీకి రాలేదు. ఇక, త్వరలోనే ప్రధాని ఏపీకి రానున్నారు. అది కూడా నేరుగా ఆయన ఢిల్లీ నుంచి విశాఖపట్నం రానున్నట్టు తెలిసింది.
ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం రానున్నారు. సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వర్చువల్‌గా హైడ్రో ప్రాజెక్టుకు, ఫార్మా ఎస్ఈజెడ్లీ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాన మంత్రి రాక నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ సమీక్షించారు. భద్రత, ఏర్పాట్లు వంటివాటిపై నిశితంగా దృష్టి పెట్టారు.
ఇక, కూటమి సర్కారు కూడా.. ప్రధాని చేతుల మీదుగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు.. బీజేపీ కూడా ప్రధాని రాక నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా బలపరుస్తు న్నదీ వివరించే ప్రయత్నం చేయనున్నట్టు నాయకులు తెలిపారు. మొత్తానికి రాజకీయ పరమైన, అధికారికపరమైన పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
This post was last modified on November 24, 2024 6:59 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…