ఈ ఏడాది జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే దక్కాయి. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీలు 164 స్థానాల్లో విజయం దక్కించుకోగా.. కేవలం వైసీపీ 11 సీట్లకే నిలబడిపోయింది. అయితే.. దీనిపై అప్పట్లోనే చంద్రబాబు విశ్లేషించారు. కూటమి పార్టీలు కాలికి బలపం కట్టుకుని తిరిగాయని.. అయినా కూడా ఎందుకు ఇలా జరిగిందని ఆయన మీడియా ముందే చెప్పుకొచ్చా రు. దీనిపై అంతర్గత చర్చలు కూడా చేశారు.
ఈ సమయంలో ఆయన ఆ 11 స్థానాల్లోని టీడీపీ ఇంచార్జ్‌లకు కూడా వార్నింగులు ఇచ్చారు. “బీటెక్ రవి సునాయాసంగా గెలిచే ఛాన్స్ ఉంది. అయినా.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దీనికి సమన్వయం లేకపోవడాన్ని గుర్తించాం“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచిన విషయంపై అయితే.. చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గెలిచితీరాల్సిన స్థానం ఇదేనని, కానీ, అంతర్గత కుమ్ములాటలతోనే దీనిని చేజార్చుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి అంగళ్లలో చంద్రబాబుపై దాడులు జరిగినప్పుడు.. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య రాళ్ల యుద్ధం సాగినప్పుడు సానుభూతి పెరుగుతుందని ఆశించారు. అలానే పెరిగిందికూడా. కానీ, పుంగనూరులో `రామచంద్ర` పేరుతో ఎక్కువ మంది పోటీలో నిలిచారు. దీనికితోడు సమన్వయం కూడా సన్నగిల్లిందని తేల్చారు. అదేవిధంగా కడప జిల్లా బద్వేల్‌లోనూ టీడీపీ నేతలు వైసీపీకి సహకరించారన్న వాదనపై స్పందించారు. ఈ క్రమంలోనే అక్కడి టీడీపీ ఇంచార్జ్.. బొజ్జా రోశన్న ను పక్కన పెట్టారు.
ఇక, ఎస్టీ నియోజకవర్గాలైన అరకు, పాడేరులోనూ పరాజయం పాలవడానికి తమ్ముళ్లు సహకరించలేదన్న వాదనను కూడా చంద్రబాబు అంగీకరించారు. అలానే ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శిలో ప్రస్తుతం మంత్రి గొట్టిపాటి రవి కుటుంబీకురాలు డాక్టర్ లక్ష్మి చివరి వరకు పోరాడారు. లీడ్‌లోనే కొనసాగారు. కానీ, చివరి రౌండ్లలో వైసీపీ అభ్యర్థి.. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి విజయం దక్కించుకున్నా రు. ఇక్కడ కూడా తమ్ముళ్లదే తప్పని అప్పట్లోనే చంద్రబాబు తీర్మానించారు. సమన్వయ లేమి కారణంగా వైసీపీ 11 సీట్లు దక్కించుకుందన్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.
This post was last modified on November 24, 2024 2:28 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…