స్కూళ్లలో పిల్లలకు టీచర్లు పరీక్షలు పెట్టడం…మార్కులు వేయడం….ఆ సంవత్సరం ప్రోగ్రెస్ కార్డుల్లో పర్ ఫార్మెన్స్ ని బట్టి తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయడం…లేదంటే డిమోట్ చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు….ఫస్ట్ ర్యాంకులు సాధించి బెస్ట్ పిల్లలు పరేషాన్ అవుతుంటారు. ఇదే తరహాలో ఇకపై ఏపీలోని వైసీపీ పొలిటికల్ స్కూల్లో మంత్రులకు మార్కులు వేయబోతున్నారట సీఎం జగన్.
టీచర్ అవతారమెత్తబోతోన్న జగన్ తన మంత్రి వర్గ సభ్యులను ‘టెస్ట్’చేసి మార్కులు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అంతేకాదు…ఆ మార్కుల ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించి…వారికి ప్రమోషన్…డిమోషన్ డిసైడ్ చేయబోతున్నారట. సరైన ర్యాంకులు రాని మంత్రులకు ఉద్వాసన తప్పదని జగన్ సంకేతాలిచ్చారట. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో తక్కువ ర్యాంకులు తెచ్చుకున్న ఒకరిద్దరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.
వాస్తవానికి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని జగన్ గతంలో చెప్పారు. దీంతో, అప్పటిదాకా తమకు ఢోకా లేదని మంత్రులంతా అనుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, కొందరు మంత్రుల వ్యాఖ్యలు, పనితీరు, తనపైనా, ప్రభుత్వంపైనా రాస్తున్న కథనాలకు కొందరు మంత్రుల లీకులే కారణమన్న ఆరోపణలు నేపథ్యంలో జగన్ ఈ మార్కులు, ర్యాంకుల పద్ధతి ప్రవేశపెట్టారట.
మంత్రివర్గంలో ఇద్దరు ముగ్గరు మినహా మిగతా వారి పనితీరుపై జగన్ సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. హోమంత్రి, సమాచార శాఖతో పాటు మరికొందరి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వానికి డ్యామేజి కలిగేలా కొందరు మంత్రులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందట.
ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రిపై, రాయలసీమకు చెందిన మరో మంత్రిపై జగన్ కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రులిద్దరినీ మినహాయించి మిగతా మంత్రుల పనితీరుపై క్షేత్రస్ధాయి సమీక్షలు జరిపేందుకు జగన్ రెడీ అయ్యారట. మిగిలి ఉన్న ఏడాదికాలంలో మంత్రుల పనితీరు మెరుగుపరుచుకునేందుకు జగన్ ఈ అవకాశం ఇచ్చారట.
తన ప్రభుత్వానికి మంత్రుల పనితీరే గీటురాయి అన్న భావనలో ఉన్న జగన్…ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక, ఏడాది తర్వాత ఖాళీ అయ్యే బెర్తుల కోసం కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేసి రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే ఇటు సీఎం జగన్ ను, అటు సీఎంవో అధికారులను ఇంప్రెస్ చేసే పనిలో వారంతా బిజీబిజీగా ఉన్నారట.
This post was last modified on October 6, 2020 12:29 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…