మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇస్తూ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం దేశవ్యాప్తంగా ఎన్డీఏ శక్తిని చాటిచెప్పిందని వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్రలో రాహుల్ గాంధీ విద్వేష ప్రచారం చేసినా, ప్రజలు వారి అబద్ధాలను నమ్మలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం, మహారాష్ట్రకు పంపిన నిధులు కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీ సాధించిందని, గత ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన రాజకీయ కుట్రకు ప్రజలు సమాధానం చెప్పారని అభిప్రాయపడ్డారు.
ఇక ఫలితాలు రాకముందే కాంగ్రెస్ నాయకులు గెలుపు సంబరాలకు సిద్ధమయ్యారని, చివరికి వారంతా ఆందోళనలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారమేనని, ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మబట్టలేదని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుల విష ప్రచారం ప్రజలను ప్రభావితం చేయలేకపోయిందని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలను మోసం చేశాయని, ఆ దుష్ప్రభావం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు ఎదురయ్యిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపు దేశవ్యాప్తంగా పార్టీ ప్రాధాన్యతను మరింత పెంచుతుందని తెలిపారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లాంటి నాయకుల రాజకీయ కుతంత్రాలను ప్రజలు భరించలేక, తగిన శాస్తి చేశారని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ లాభాల కోసం ఎన్డీఏతో చేసిన వెన్నుపోటు వెనుక దాగి ఉన్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని కరెక్ట్ తీర్పు ఇచ్చారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
This post was last modified on November 24, 2024 7:53 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…