మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)ల మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్‌లు కాంగ్రెస్ పార్టీని ఘోర పరాజయం నుంచి కాపాడలేకపోయాయని కేటీఆర్ ఎద్ధేవా చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ చేయాలని, ప్రజలకిచ్చిన 6 హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షంగా ఎదగడంలో మాత్రం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ సమర్థత వల్ల గెలవడం లేదని, కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాగిస్తోందని చురకలంటించారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత ఇప్పటికైనా గుర్తించాలని, దేశ భవిష్యతు ప్రాంతీయ పార్టీలేనని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీల కష్టాన్ని నిస్సిగ్గుగా సొమ్ము చేసుకుంటున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు.
కాగా, లగచర్ల ఫార్మా బాధిత రైతుల అంశంపై కేటీఆర్ మాట్లాడారు. రైతులను జైల్లో పెట్టిన రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెబుతామని అన్నారు. జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో చర్లపల్లి జైలులో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. జైల్లో నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారని, తన కోసం కొట్లాడొద్దని, అన్యాయంగా జైలుపాలైన కొడంగల్ రైతుల పక్షాన కొట్లాడాలని ఆయన కోరారని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులో నరేందర్ రెడ్డి, రైతులు జైలు పాలయ్యారని విమర్శించారు.
సొంత నియోజకవర్గం కొడంగల్ కు రేవంత్ రెడ్డి రారాజు కాదని, ఆయనలాంటి నియంతలు ఎందరో పోయారని గుర్తు చేశారు. కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లి దాకా శిశుపాలుడిలాగా రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులను ప్రజలు లెక్క గడుతున్నారని, ఆయన పాపం పండే రోజు దగ్గరలో ఉందని అన్నారు.
This post was last modified on November 23, 2024 6:15 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…