ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి జరిగిందని గతంలో షర్మిల ఆరోపించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తొలిసారి స్పందించారు. వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని బాలయ్య అన్నారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇక, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని, ఈ రోజు కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. ఈ రోజు బీఏసీ ఛైర్మన్ ఎన్నిక కోసం వైసీపీ సభ్యులు వస్తారని, వాళ్ల స్వార్థం కోసం వస్తారని, అయినా వృథా ప్రయాస అని చెప్పారు. బాలయ్య వెంట ఆయన చిన్నల్లుడు, టీడీపీ ఎంపీ భరత్ ఉన్నారు.
కాగా, బాలకృష్ణకు చెందిన ఎన్డీకే బిల్డింగ్ నుంచి ట్రోలింగ్ జరిగిందని, దాని వెనుక బాలకృష్ణ ఉన్నారని ప్రచారం జరుగుతోందని షర్మిల గతంలో చెప్పిన వీడియోను జగన్ రెండు రోజుల క్రితం మీడియా ముందు ప్రస్తావించారు. ఆ వీడియోను జగన్ వాడి సానుభూతి పొందాలని చూస్తున్నారని, ఆ విషయం చెప్పిన తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ ఏం చేశారని షర్మిల నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ వ్యాఖ్యలపై బాలయ్య బాబు స్పందించారు.
This post was last modified on November 23, 2024 9:57 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…