Political News

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం జగన్ తో అదానీకి లింకులు అంశంపై మాట్లాడిన తర్వాత జగన్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షర్మిల సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. తాను ఏదో ఒక ప్రజా సమస్యపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని, దానికోసం చాలా స్టడీ చేసి వస్తానని, అయితే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత టాపిక్ కు సంబంధం లేని ఏదో ఒక ప్రశ్న తనను అడుగుతారని షర్మిల అనడంతో ప్రెస్ మీట్ లో నవ్వులు పూశాయి.

సబ్జెక్ట్ వదిలేసి తాను జగన్ గారి గురించి చేసిన కామెంట్ల గురించి మాత్రమే హైలైట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ షర్మిల అన్న మాటలు విని మీడియా ప్రతినిధులంతా నవ్వారు. సాక్షి టీవీ మమ్మల్ని ఎలాగూ కవర్ చేయదు…మిగతా ఛానెళ్లు నేను జగన్ గురించి మాట్లాడిన మాటలు మాత్రమే కవర్ చేస్తే మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి అంటూ షర్మిల కాస్త అన్న మాటలు మీడియా ప్రతినిధులకు నవ్వు తెప్పించాయి. జగన్ మోహన్ రెడ్డిగారికి అదానీ లంచం ఇస్తే నాకేం రాదు..అంటే నాకు రావాలి అని అనడం లేదు…నాకు సంబంధం లేదు అని చెబుతున్నా…అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల ప్రెస్ మీట్ లో నవ్వులు పూయించాయి.

అయితే, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తానని, అదే సమయంలో ప్రజా సమస్యలను హైలైట్ చేయాల్సిన బాధ్యత మీడియాకు ఉందని షర్మిల కాస్త సీరియస్ గా కామెంట్లు చేశారు. ఇట్లాంటివి కూడా కాస్త కవర్ చేయాలి కదా..అని షర్మిల అన్నారు. ప్రజా సమస్యలపై కవర్ చేయండి దయచేసి…కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు….కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ…అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టింది… దేశాన్ని రక్షించగలిగిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. మీడియాపై షర్మిల సెటైర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

39 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago