జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిని డెవలప్ చేస్తే రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని దుర్గేష్ వెల్లడించారు. నూతన టూరిజం పాలసీతో పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారని, దీంతో, ఆ రంగాన్ని మరింత డెవలప్ చేయొచ్చని చెప్పారు. పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా కల్పించిన రాష్ట్రంగా ఏపీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని దుర్గేష్ తెలిపారు. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా అందమైన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు 5 రోజులు ఉండేలా టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం హోటళ్లలో ఉన్న రూమ్ ల సంఖ్యను 3500 నుండి 10,000 కు పెంచబోతున్నామని, పీపీపీ విధానంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురానున్నామని చెప్పారు.
విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్ లు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అమరావతి – నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు తదితర ఆలయాలను కలిపేలా 10 సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కోస్టల్ టూరిజం సర్క్యూట్ లో భాగంగా వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో 5 బీచ్ సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రివర్ టూరిజం సర్క్యూట్, 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్ లను డెవలప్ చేస్తామన్నారు. శ్రీకాకుళం- విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్ లు రాబోతున్నాయని చెప్పారు. ఇంకా సభ్యులు ఏమైన సలహాలు, సూచనలు ఇస్తే వాటిని పరిశీలిస్తామని అన్నారు.
దుర్గేష్ ప్రకటన విన్న తర్వాత స్పీకర్ చైర్ లో ఉన్న రఘురామ సంతోషం వ్యక్తం చేశారు. దుర్గేష్ వివరిస్తుంటే అందమైన ఆంధ్రప్రదేశ్ కళ్ల ముందు కదలాడిందని చెప్పారు. ఇంత అద్భుతంగా చెప్పాక ఎవరి సూచనలు అవసరం లేదని రఘురామ అన్నారు. దుర్గేష్ వివరిస్తుంటే అందమైన ఆంధ్రప్రదేశ్ ను ఊహించుకుంటున్నానని, అంత అద్భుతంగా ఉంది ఆయన ఆలోచన, ప్రజెంటేషన్ అని కితాబిచ్చారు. మంత్రి దుర్గేష్ ఆలోచనకు చంద్రబాబు వంటి గొప్ప నాయకుడి సపోర్ట్ ఉందని అన్నారు. అంతే కాకుండా, కేంద్ర టూరిజం శాఖా మంత్రి తనకు మంచి మిత్రుడని, ఆయన దగ్గరకు ఇద్దరం కలిసి వెళ్లి నూతన పాలసీపై చర్చిద్దామన్నారు.
This post was last modified on November 22, 2024 6:43 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…