టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులకు షర్మిల గతంలో ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ప్రభాస్ వ్యవహారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు’ అంటూ షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు.
తనపై బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక వీడియోను జగన్ చూపించారని, అలా జరిగిందని తెలిసి ఉంటే ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ గాడిదలు కాశారా అని షర్మిల నిలదీశారు. ఆ విషయంపై ఎంక్వైరీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనతో సంబంధం ఉందని వచ్చిన ప్రచారాన్ని మీ సోషల్ మీడియా ప్రచారం చేయదా? అని ప్రశ్నించారు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారనే ప్రచారం కూడా జరిగిందని, తన వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారని, నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారని దుయ్యబట్టారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు. మోదీకి జగన్ దత్త పుత్రుడని, ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయని, అందులో జగన్ కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. జగన్ పేరు చెప్పకున్నా ఆగస్టు 2021 లో ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయని, పవర్ సప్లై విషయంలో జగన్ ను గౌతం అదానీ కలిసి డీల్ మాట్లాడుకున్నారని ఆరోపించారు.
జగన్ తన తప్పులను ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారని షర్మిల అన్నారు. అయితే, తాను జగన్ పై విమర్శలు చేయకుండా ఉండలేనని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ హోదాలో ఇటువంటి విషయాలపై తాను మాట్లాడుకుంటే ఎలా? అని అన్నారు. మోదీ.. అదానీల బంధం గట్టిదని, పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడని ఆరోపించారు.
This post was last modified on November 22, 2024 2:29 pm
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…