ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం చంద్రబాబు తెరమీదికి తీసుకువచ్చారు. దీని ప్రకారం.. కీలక ప్రాజెక్టుల్లో ప్రజల భాగ స్వామ్యం మరింత పెరగనుంది. నిజానికి ఇప్పటి వరకు పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్) ఉండేది. అంటే.. ప్రభుత్వం-ప్రైవేటు సంస్థలు కలిసి చేపట్టే ప్రాజెక్టులు. ఇది కొన్ని దశాబ్దాలుగా అమలు అవుతున్నదే. దీనికింద అనేక ప్రాజెక్టులు కూడా వచ్చాయి.
అయితే.. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నది పీపీపీపీ (పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ విత్ పీపుల్) అంటే.. ఇక, నుంచి ప్రజలను కూడా ఆయా ప్రాజక్టుల్లో భాగస్వాములను చేస్తారు. గ్రామం నుంచి నగరంవరకు కూడా.. పెద్ద ఎత్తు చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్ణయం ప్రకారం.. రెండు కీలక ప్రాజెక్టుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీపీ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
వీటిలో నీటి పారుదల, రహదారులు ఉన్నాయి. ఇవి రెండు కూడా గ్రామీణ ప్రాంతాలకు కీలకంగా మారా యి. దీని ప్రకారం రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో మాత్రమే ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. దీనిని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే సక్సెస్ అవుతుంది. అయితే.. సర్కారు ప్రజలు అర్థం చేసుకుంటారనే భావిస్తోంది.
ప్రస్తుతం గుంతలు పడి.. ప్రయాణానికి అనుకూలంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రహదారులను బాగు చేసిన 10-20 రూపాయలను టోల్ రూపంలో వసూలు చేస్తే ఇబ్బంది లేదని భావిస్తోంది. ఇక, గోదావరి నీటిని బనకచర్ల(కర్నూలు) వరకూ తీసుకెళ్లేందుకూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు రూ. 70వేల కోట్లు ఖర్చవుతాయి. ఈ విషయంలోనూ ప్రజల నుంచి భాగస్వామ్యం కింద కొంత సొమ్ము వసూలు చేస్తారు. ఫలితంగా రైతులు ఇప్పటి వరకు కడుతున్న నీటి తీరువా మరింత పెరుగుతుంది. అయితే.. రైతులు అర్థం చేసుకుంటారని సర్కారు భావిస్తోంది. అలా అయితే.. ఈ రెండు ప్రాజెక్టులు సక్సెస్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 22, 2024 2:25 pm
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…