ఏపీ ప్రతిపక్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ. ఈ ఏడాది మండలికి ఎన్నికైన ఆయనకు వైసీపీ అధినేత జగన్ మండలిలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు. దీంతో మండలిలో సర్వం ఆయనే అన్నట్టుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శాసన సభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం తాడేపల్లి కార్యాలయానికే పరిమితం అవుతున్నారు.
దీంతో కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో వైసీపీ వాయిస్ వినిపించడం లేదు. అయితే.. దీనికి దీటుగా మండలిని వైసీపీ ప్రధాన వేదికగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడే ప్రభుత్వాన్ని నిలదీసే దగ్గర నుంచి ప్రశ్నలు సంధించే వరకు కూడా సభ్యులు దూకుడుగా ఉంటున్నారు. వీరికి నేతృత్వం వహిస్తున్న బొత్స సత్యనారాయణ దూకుడుగా ఉంటున్నా.. మధ్య మధ్య తడబడుతున్నారనే చర్చ సాగుతోంది. దీంతో బొత్సను మంత్రులు లైట్ తీసుకుంటున్నారు.
కానీ, తన శక్తి కొద్దీ బొత్స వ్యాఖ్యలు చేయడంతోపాటు.. పలు అంశాలపై బలమైన వాదన వినిపిస్తున్నారు. అయితే.. లోపం ఎక్కడ వస్తోందంటే.. సరైన గణాంకాలతో.. సరైన వాదనా పటిమతో ఆయన కూటమి మంత్రులను కట్టడి చేయలేక పోతున్నారు. వాస్తవానికి మండలిలో వైసీపీకి బలం ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం పలు బిల్లులకు ఇక్కడ ఆమోదం లభించడం కష్టమనే భావించింది. అయితే.. బొత్స వ్యవహార శైలికారణంగా బలమైన పోటీ ఇవ్వలేక పోతున్నారన్న చర్చ ఉంది.
ఇటీవల 6 బిల్లులను ఏకపక్షంగా మండలిలో కూటమి ఆమోదించుకుంది. కనీసం.. వీటిని వ్యతిరేకించేందుకు కూడా బొత్స ప్రయత్నించలేదు. ఏ చిన్న వివాదం జరిగినా.. మేం వాకౌట్ చేస్తున్నాం.. అని మాత్రం చెబుతున్నారు. మండలి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కూటమి సభ్యులకు సర్కారుకు కూడా బొత్స మేలు చేస్తున్నారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఆయనకు ఇదొక అద్భుతమైన అవకాశమని.. మంత్రిగా గతంలో చేసినా.. ఇప్పుడు మండలిలో విపక్ష నాయకుడిగా ఆయనకు మెరుగైన బాధ్యతలు వచ్చాయని చెబుతున్నారు.
This post was last modified on November 22, 2024 11:21 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…