“హత్యలు చేసేవారిని వెనుకేసుకు వస్తాడు. వారికి టికెట్ ఇస్తాడు. వారు అసలు అమాయకులు అని కూడా అంటాడు. ఇక, సోషల్ మీడియాలో తల్లిని, చెల్లిని బండ బూతులు తిట్టిన వారిని కూడా వెనుకేసుకు వస్తాడు.. ఆయన మనస్తత్వం ఏంటో నాకైతే అర్థంకాలేదు అధ్యక్షా!” అని వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ విషయంలో ఎవరు హద్దు మీరినా ఏం చేయాలో అది చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మహిళలకు పలు రాష్ట్రాల్లో కల్పిస్తున్న భద్రతను, అక్కడి చట్టాలను కూడా అధ్యయనం చేస్తున్నామని.. మహిళలకు భరోసా ఇచ్చేలా ఇక్కడ కూడా మార్పులు తెస్తున్నామన్నారు. “వర్రా రవీంద్రారెడ్డి. అధ్యక్షా .. అతను సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు పలకడానికి కూడా నాకు నోరు రావడం లేదు. నా నోటితో ఆ మాటలు చెప్పలేను . అలాంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి(జగన్) వెనుకేసుకు వస్తాడు” అన్నారు.
“సొంత తల్లిని, చెల్లిని బండ బూతులు తిట్టిన వర్రాను వెనుకేసుకువస్తున్నాడంటే.. ఈయన మనస్తత్వం ఏంటో అర్ధం చేసుకోవాలి. పైగా.. టీడీపీ వాళ్లే నకిలీ ఖాతాలు తెరిచి వర్రా పేరుతో పోస్టులు పెడుతున్నా రంటూ మాపై నిందలు వేస్తున్నాడు. పవిత్రమైన సభలో ఆ పోస్టుల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అవినాష్‌రెడ్డిపై కూడా కేసు పెట్టాలని షర్మిల చెబుతున్నారు. కానీ, ఆ మహానుభావుడు మాత్రం వర్రా అమాయకుడని అంటున్నాడు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
పక్కాగా లా అండ్ ఆర్డర్
రాష్ట్రంలో శాంతి భద్రతలను పక్కాగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్ర బాబు చెప్పారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ఓ ఖాతా తెరిచేసి నకిలీ పేర్లతో మహిళలపై విమర్శలు చేస్తే.. తాట తీసేలా వ్యవహరిస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ రుచి చూస్తారని హెచ్చరించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో వైసీపీ వారే ఉన్నారని, వారే. అసభ్యంగా పోస్టులు పెట్టి మహిళలను, మంత్రులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
This post was last modified on November 22, 2024 9:45 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…