Political News

బాబు విజ‌న్‌: ఏపీకి 1.87 ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబ‌డి!

ఏపీలో గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా నేష‌న‌ల్ ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డిని పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన వ‌స్తున్న పెట్టుబ‌డుల్లో ఇదే అతి పెద్ద‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌బుత్వం ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ విశాఖ‌లో 65 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు అంగీక‌రించింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అతి పెద్ద పెట్టుబ‌డిగా ప్ర‌భుత్వం భావించింది. కానీ, ఇంత‌లోనే గురువారం సాయంత్రం చంద్ర‌బాబును క‌లిసిన ఎన్టీపీసీ ప్ర‌తినిధులు.. 1,87,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. త‌ద్వారా రాష్ట్రానికి 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం స‌మ‌కూర‌నుంది. అదేవిధంగా ల‌క్ష మంది యువ‌త‌కు ఉద్యోగాలు, 5 ల‌క్ష‌ల మందికి పైగా ఉపాధి క‌ల‌గ‌నుంది.

ఏం చేస్తారు?

ఎన్టీపీసీ పెడుతున్న ఈ భారీ పెట్టుబ‌డితో రాష్ట్రంలో పున‌రుత్వాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. ఇత‌ర సంస్థ‌ల‌తో క‌లిసి.. ఈ ప్రాజెక్టుల‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేయ‌నుంది. వీటిలో ఎన్‌జీఈఎల్‌, ఎన్ ఆర్ ఈడీసీఏపీలు స‌హ భాగ‌స్వాములుగా ఉండ‌నున్నాయి. త‌ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఈ సంస్థ‌ల‌ను పెట్ట‌నున్నారు. దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీపీసీ పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదేన‌ని పారిశ్రామిక వేత్త‌లు, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్ర‌బాబు విజ‌న్‌కు ఇది తార్కాణ‌మ‌ని మంత్రి గొట్టి పాటి ర‌వి ప్ర‌శంసించారు.

This post was last modified on November 22, 2024 9:42 am

Share

Recent Posts

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

1 hour ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

1 hour ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

3 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

4 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

5 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

5 hours ago