Political News

వ‌ద‌ల బొమ్మాళి: వ‌ర్మ‌ను వెంటాడుతున్న కేసులు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకే ఆయ‌న ఆప‌సోపాలు ప‌డుతున్నారు. అయితే.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా కేసులు ఆయ‌న‌ను వెంటా డుతూనే ఉన్నాయి. సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెల‌రేగిన ఫ‌లితంగా వ‌ర్మ‌కు ఇప్పుడు సెగ బాగానే త‌గులుతోంది. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామ‌లింగ‌య్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు న‌డుస్తోంది.

41 ఏ కింద నోటీసులు కూడా అందుకున్న వ‌ర్మ‌.. విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. మ‌రోవైపు హైకోర్టును కూడా ఆశ్ర‌యించారు. అయితే.. అక్క‌డ ఆయ‌న‌కు ఎదురు దెబ్బ త‌గ‌ల‌డంతోపాటు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని న్యాయ‌మూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు.. బెయిల్ కావాలంటే ప్ర‌త్యేకంగా పిటిష‌న్ వేసుకోవాల‌ని సూచించారు. దీంతో రెండు రోజుల కింద‌ట వ‌ర్మ ముంద‌స్తు బెయిల్ కోరుతూ.. పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్నారు.

దీనిపై విచార‌ణ ఇంకా ప్రారంభం కాక‌ముందే.. ఇప్పుడు మ‌రో జిల్లాలో కేసు న‌మోదైంది. సామాజిక మాధ్యమాల్లో… అసభ్యకర పోస్టింగ్‌లపై… రాంగోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసుల నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఈ కేసు విష‌యంపై విచార‌ణ‌కు హాజ‌రయ్యేందుకు వారం రోజుల గడువు కావాల‌ని కోరుతూ వ‌ర్మ త‌న న్యాయవాదిని పంపించారు.

బిజీ షెడ్యూల్ కారణంగా రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారని న్యాయ‌వాది బుల్లి బాబు తెలిపారు. దీనిపై పోలీసులు త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా వ‌ర్మ ప‌రిస్థితి ఇప్పుడు ఒక జిల్లా నుంచి మ‌రో జిల్లాకు మారుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా మొత్తం 13 జిల్లాల్లో కేసులు న‌మోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాల‌కు చెందిన పోలీసులు కూడా వ‌రుస‌గా నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

This post was last modified on November 22, 2024 9:40 am

Share

Recent Posts

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

23 minutes ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

27 minutes ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

4 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

4 hours ago