గౌతం అదానీ. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రపంచ కుబేరుల్లో తొలి ముగ్గురిలో అదానీ కూడా ఉండడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదానీ వ్యాపార సామ్రాజ్యాల పంట పండుతోందన్న వాదన కూడా ఉంది. అయితే.. తరచుగా అదానీపై ప్రపంచ దేశాల్లో అనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్ల కిందట.. అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా సంస్థ హెండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.
ఇది భారత పార్లమెంటును ఇప్పటికీ కుదిపేస్తున్న అంశమే. ఇక, ఇప్పుడు తాజాగా అదానిపై ఏకంగా కేసే నమోదైంది. అది కూడా అమెరికాలో కావడం.. మరింత సంచలనంగా మారింది. అమెరికాలో భారీ ఎత్తున కాంట్రాక్టుపనులు దక్కించుకునేందుకు అక్కడి భారత సంతతి అధికారులకు అదానీ కోట్ల రూపాయల లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయనప మోసపూరిత కుట్ర కింద అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు.. అదానీపై అరెస్టు వారెంటు కూడా జారీ అయిందని సమాచారం.
ఎంత ?
తన కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా అత్యంత రహస్య ప్రాంతంలో భారత సంతతి అధికారులకు అదానీ 2250 కోట్ల రూపాయల వరకు ముడుపులు చెల్లించారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ) పేర్కొంది. ఇది అత్యంత తీవ్రమైన కేసుగా నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పతనం!
అదానీపై అరెస్టు వారెంటు జారీ అయిందని.. ఆయనపై లంచాల కేసు నమోదైందని తెలియడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అఅదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఢమాల్ అంటూ.. దిగజారిపోయాయి. దాదాపు అన్ని కంపెనీల షేర్లు పతనమయ్యాయి. సుమారు 20 శాతం మేర షేర్లు క్షీణించడం అదానీ గ్రూప్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్‌తో పాటు అన్ని కంపెనీల షేర్లు పతనావస్థకు చేరుకున్నాయి.
This post was last modified on November 21, 2024 2:27 pm
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…