వైసీపీ హయాంలో అమరావతిని జగన్ అడవిగా మార్చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టింది. దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదల తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ ముళ్ల కంపలను నుగ్గు చేసేందుకు తెచ్చిన ఓ భారీ యంత్రం ఆకట్టుకుంటోంది.
డిసెంబరులో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించనున్న నేపథ్యంలో భారీ యంత్రాల సాయంతో ముళ్ల కంపల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. ముళ్ల కంపలతో కమ్ముకు పోయిన రోడ్లు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. అయితే, అక్కడ తొలగించిన ముళ్లకంపను వేరే చోటికి తరలించకుండా అధికారులు వినూత్న పద్ధతిలో దానిని నుగ్గు చేస్తున్నారు. చెన్నై నుంచి తెచ్చిన ఓ భారీ యంత్రం సాయంతో తొలగించిన కంపను నుగ్గు నుగ్గు చేస్తున్నారు.
అంతేకాదు, ఆ నుగ్గు వేస్ట్ కాకుండా సిమెంట్ కంపెనీల బాయిలర్లు, ఎనర్జీ ప్లాంట్లు, ఇటుక బట్టీలలో వినియోగించేలా దానిని అమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే చెత్త నుంచి సంపద సృష్టిస్తానన్న సీఎం చంద్రబాబు మాటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ మాదిరిగానే జగన్ ముళ్ల కంపలతో అమరావతిని అడవి చేస్తే…చంద్రబాబు ఆ ముళ్లను నుగ్గు చేసి అమరావతికి ఆదాయం తెచ్చిపెట్టారని ప్రశంసిస్తున్నారు. విజనరీ లీడర్ కు విధ్వంసకర నేతకు ఉన్న తేడా ఇదని అంటున్నారు.
కాగా, జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన రోడ్లు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు మునుపటి కళను సంతరించుకున్నాయి.
This post was last modified on November 21, 2024 4:04 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…