2024 సార్వత్రిక ఎన్నికలలో 11 స్థానాలకే వైసీపీ పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. అయితే 11 మంది సభ్యులున్నప్పటికీ తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ, నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజా పద్ధుల కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ రోజు పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ కావడంతో ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కించుకునే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవికి వైసీపీ సభ్యుడు నామినేషన్ వేస్తారా లేదా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.
పెద్దిరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయనను నామినేట్ చేస్తారా లేక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఎవరో ఒక సభ్యుడిని ఎన్నుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాతో పాటు సరిపడా సంఖ్యాబలం ఉండడంతో సంప్రదాయం ప్రకారం టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కానీ, ఈసారి వైసీపీకి అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా పీఏసీ ఛైర్మన్ ఎన్నిక..జగన్ కు విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు.
This post was last modified on November 21, 2024 2:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…