Political News

ఎగ్జిట్‌పోల్‌: మ‌హారాష్ట్ర‌లో క‌మ‌ల వికాసం?

తాజాగా ముగిసిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ల‌కో ర‌కంగా వ‌చ్చాయి. అయితే.. మెజారిటీ సంస్థ‌లు బీజేపీకి ప‌ట్టంక‌ట్టాయి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి(భారీ కూట‌మి) కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడ‌త‌లో బుధ‌వారం(న‌వంబ‌రు 20) పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంతంగానే ఈ ప్ర‌క్రియ సాగిపోయింది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్.. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. మ‌రికొన్ని చోట్ల సాయంత్రం 6 వ‌ర‌కు కూడా కొన‌సాగింది.

పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన అర‌గంట త‌ర్వాత‌.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఎవ‌రికి విజ‌య అవ‌కాశాలు ఉన్నాయ‌నే విష‌యంపై ప‌లు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ+శివ‌సేన‌(ఏక్‌నాథ్ షిండే)+ఎన్సీపీ(అజిత్ ప‌వార్‌) కూట‌మి మ‌హాయుతిగా రంగంలోకిదిగాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్‌+శివ‌సేన‌(ఉద్ద‌వ్ ఠాక్రే)+ఎన్సీపీ(శ‌ర‌ద్ ప‌వార్‌) కూట‌మి మ‌హా వికాస్ అఘాడీగా బ‌రిలో నిలిచాయి. వీటితో పాటు బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఎంఎన్‌సీ, ఎంఐఎం వంటివి కూడా ప్ర‌భావం చూపుతున్న‌ట్టు ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఎస్ ఏఎస్ గ్రూప్‌: ఈ సంస్థ అంచ‌నాల ప్ర‌కారం మ‌హా వికాస్ అఘాడీ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఈ కూట‌మి పార్టీలు మొత్తం 288 స్థానాల్లో 147-155 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం ఉంది. ఇక, బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి 127-135 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. మెజారిటీ మేజిక్ ఫిగ‌ర్ ప్ర‌కారం.. 288 స్థానాల్లో 145 స్థానాలు ద‌క్కించుకున్న కూట‌మి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టనుంది. కాబ‌ట్టి ఈ స‌ర్వే ప్ర‌కారం.. మ‌హావికాస్ అఘాడీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

పీపుల్స్ ప‌ల్స్ సర్వే: ఈ స‌ర్వే ప్ర‌కారం బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమికి 182(175 -195) సీట్లు, మ‌హావికాస్ అఘాడీ కూటమికి 97(85 -112) సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఈ స‌ర్వే ప్ర‌కారం ఇతరులుకు 9 (7 -12) సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక‌, చాణ‌క్య స‌హా సీఎన్ ఎన్, న్యూస్ 18 వంటివి కూడా బీజేపీ కూట‌మికే మెజారిటీ అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా బీజేపీకి ఎక్కువ‌గా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వేలు చాటి చెప్పాయి.

This post was last modified on November 21, 2024 12:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

1 hour ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

1 hour ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

2 hours ago

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…

3 hours ago

బన్నీ చేసిన తప్పు.. చేయని తప్పు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…

3 hours ago

అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…

3 hours ago