ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? అంటే.. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి చర్చలు జరుగుతాయి… ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు జవాబిస్తారు.. అనే ఆన్సరే వస్తుంది. అయితే.. ఇది పైకి కనిపిస్తున్న విషయం మాత్రం. కానీ,సభ్యులు, స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అంతకు మించి ఏదో జరుగుతోందని అర్ధమవుతోంది. మంత్రులు ఎలా ఉన్నప్పటికీ.. సభ్యులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మంత్రులు ఎవరూ సభలో ఉండడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరికొందరు సభ్యులు.. తాజాగా అధికారులు తమ మాట వినిపించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో సభలో ఏం చేయాలో కూడా తమకు తెలియడం లేదని వాపోతున్నారు. ఒకరంటే అనుకోవచ్చు.. కానీ పదుల సంఖ్యలో సభలో అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం ఆశ్చర్యపోయేలా ఓ వ్యవహారం తెరమీదికి వచ్చింది. అధికారులు సరైన స్పూర్తితో పనిచేయడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలను, అడగాల్సిన ప్రశ్నలకు కొందరు అధికారులు మండలికి బదిలీ చేశారు. దీనిని స్పీకర్ తప్పుబట్టారు. అసెంబ్లీకి కేటాయించిన అంశాలను మండలికి ట్రాన్స్‌ఫర్ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇక, అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అడగాల్సిన ప్రశ్నలను ఏకకాలంలో మండలిలోనూ ఎలా ప్రవేశ పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. అంటే.. ఒక ప్రశ్నకు సభలో సమాధానం ఇస్తున్న సమయంలోనే మండలిలో అదే ప్రశ్నను సంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మంత్రికి సంబంధించిన సబ్జెక్టు విషయంలో ఏక కాలంలో రెండు చోట్లా ప్రశ్నలు వచ్చేలా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. అధికారులు సభలో ఎందుకు ఉండ డం లేదో సమాధానం చెప్పాలన్నారు. అలాగే.. ప్రశ్నలను ఏ సభకు సంబంధించి ఆ సభలోనే ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ వ్యవహారాల అధికారుల లోపాలను సభ్యులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన వ్యవహారం మరింత వివాదం అయింది.
This post was last modified on November 20, 2024 5:24 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…