విమానాన్ని కనుగొన్నది ఎవరు అని ఆరో తరగతి పిల్లవాడిని అడిగితే ఠక్కున రైట్ బ్రదర్స్ అని సమాధానమిస్తాడు. 1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా విమానంలో ప్రయాణించారని పాఠాల్లో చాలా మంది చదువుకున్నారు. అయితే, రైట్ బ్రదర్స్ కన్నా ముందే భారతదశంలో విమానం తయారైందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు.
విమానాన్ని తొలిసారిగా రూపొందించింది వేదకాలం నాటి భరద్వాజ మహర్షి అని ఆనందీ బెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్నోలోని ఖ్వాజా మొయినుద్దీన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వీకులు కనుక్కున్న విషయాలను తెలుసుకునేందుకు దేశంలోని పురాతన పుస్తకాలను చదవాలని విద్యార్థులకు ఆమె సూచించారు. ప్రాచీన కాలంలో, వేద కాలంలో మహర్షులు, పండితులు ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశారని, వాటి గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన సిలబస్ వలన ప్రాచీన కాల విద్యా విశేషాలు తెలుసుకోలేకయామమని కొందరు అభిప్రాయపడుతుంటారు. “భరద్వాజ మహర్షి” రచించిన “యంత్ర సర్వస్వం” అనే గ్రంథంలో “వైమానిక శాస్త్రం” అనేది ఒక భాగమని, ఈ గ్రంథం 8 అధ్యాయాలుగా విభజించారని కొందరు అంటున్నారు. ఈ గ్రంథంలో విమానం నిర్వచనం, విమానం నడిపే వ్యక్తి, ఆకాశ మార్గం, వైమానిక దుస్తులు, విమాన యంత్ర భాగాలు, ఇంధనం, యంత్రము, విమాన నిర్మాణంలో ఉపయోగించే ధాతువుల గురించి రాశారని చెబుతున్నారు.
మూడు చక్రాలతో అంతరిక్షంలో విహరించే రథాన్ని (విమానాన్ని) ఋభువులు (వసువులు) అనే వారు నిర్మించారని ఋగ్వేదంలో ఉందని కొందరు పండితులు చెబుతుంటారు. పురాణాలలో దేవీ-దేవతలు, యక్షులు, విద్యాధరులు విమానాలలో ప్రయాణించారని, రామాయణంలో ఉన్న పుష్పక విమానం, మహాభారతంలోని జరాసంధుల విమానం, కర్దముడనే ఋషి తన భార్యతో విమానంలో విహరించడం వంటి వాటి గురించి పురాణేతిహాసాలలో ఉందని చాలామంది నమ్ముతుంటారు.
బహుశా ఈ నేపథ్యంలోనే ఆనందీ బెన్ పటేల్ విమానం తొలిసారి కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదన్నారేమోనని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఆధునిక సాంకేతికత వచ్చిన తర్వాత విమానంలో తొలిసారి ప్రయాణించింది రైట్ బ్రదర్స్ అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్లపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
This post was last modified on November 20, 2024 4:12 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…