శాసనసభ సమావేశాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి విషయంలో, గంజాయిని అరికట్టడం, అరాచక శక్తులను కట్టడి చేయడంలో పవన్ తమకన్నా గట్టిగా ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆ డిటర్మినేషన్ పవన్ కు ఉందని, సంఘ విద్రోహ శక్తులను తామిద్దరం కలిసి అరికడతామని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తే అవే వారికి చివరి రోజులు అని వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని చంద్రబాబు అన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని, నక్సల్స్ ను అడ్డుకొని నియంత్రించానని తెలిపారు. రౌడీ, బ్లేడ్ బ్యాచ్ లు ఉన్నాయని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామని తెలిపారు.
ప్రజాప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. అందుకు భిన్నంగా వ్యవహరించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్ కావాలని ఆకాంక్షించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, క్షేత్రస్థాయిలో ప్రజలతో కూటమి నేతలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.
సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి త్వరలో వెళ్తానని చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
This post was last modified on November 21, 2024 10:45 am
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎన్నికలకు ముందు కూటమిలోని పార్టీలు హామీ…
చాలా గ్యాప్ తర్వాత కామెడీ జానర్ కు వచ్చేద్దామని అల్లరి నరేష్ ట్రై చేసిన ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్…
ఏపీలో వలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ఆరు మాసాలుగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ హయాంలో…
దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.…