సామాజిక వర్గాల బలం లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాకో విధంగా సామాజిక వర్గాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో వీరంతా టీడీపీవైపే నిలబడ్డారు. దీంతో శ్రీకాకుళం సహా విజయనగరంలోని కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అయితే.. ఇంత జరిగినా.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కాళింగ సామాజిక వర్గంనాయకులు ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, దక్కకపోగా ఇతర కీలక పదవులు కూడా వారిని వరించలేదు. దీంతో వారంతా ఇప్పుడుచంద్రబాబుపై పట్టరాని ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు కాళింగులు ఒక్కటయ్యారు.
కేసులు పెట్టించుకున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో కూటమి సర్కారుకు ఉత్తరాంధ్రలో మంచి మెజారిటీ వచ్చింది. అయితే.. ఇలా పనిచేసిన కళింగులు అధికారంలోకి వచ్చాక అవకాశాలు రాకపోవడంతో ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రేగుతోంది. ముఖ్యంగా టీడీపీలో యువజన విభాగం నుంచి పనిచేస్తూ వచ్చిన రవికుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ ఏడాదివిజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.కానీ, దక్కలేదు. పోనీ.. తన వారికి నామినేటెడ్ అయినా ఇప్పించుకుందామని భావించారు. అది కూడా దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో కూన ప్రభావం తగ్గుతోందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా దక్కలేదు. ఈ పరిణామం కూన వర్గాన్నే కాకుండా.. కాళింగ సామాజిక వర్గంలోనూ ఆగ్రహం తెప్పించడంగమనార్హం. మరి ఇప్పటికైనా చంద్రబాబు వీరిని సంతృప్తి పరుస్తారేమో చూడాలి.
This post was last modified on November 20, 2024 11:44 am
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…