వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను నిధులు కూడా మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ల నిర్వహణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన చేశారు.
రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలకు తెర తీశామని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగిస్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ అప్పగించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎక్కడ టోల్ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల మాత్రమే టోల్ ఉంటుందని చెప్పారు. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ చార్జీలు వసూలు చేస్తామని, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులకు టోల్ చార్జీలు ఉండవని చంద్రబాబు క్లారిటీనిచ్చారు.
అయితే, దీనిపై ఎమ్మెల్యేలు కూడా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని…ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని చెప్పారు. అలా కాదు గుంతల రోడ్లపైనే తిరుగుదాం అంటే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంతల రోడ్లపై తిరిగినా పర్వాలేదు…అని కొందరు అంటారని, ఈ విధానంపై విమర్శలు వస్తాయని చెప్పారు. డబ్బులు లేకపోయినా మాకు తెలీదు..అన్నీ నువ్వే చేయాలి…అంటారని.., అయితే, తన దగ్గర మంత్రదండం లేదని, తెలివితేటలున్నాయని, వినూత్న ఆలోచనలతో ముందుకు పోదామని చెప్పారు.
ఐదేళ్లలో రాష్ట్రంలోని పలు రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని, వాటి మరమ్మతులకు 850 కోట్ల రూపాయలను అల్రెడీ కేటాయించామని చెప్పారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 2025 జనవరి నాటికి ఏపీలో పండగల సందర్భంగా ప్రజలు ఇక్కడికి వచ్చే సమయానికి మెరుగైన రహదారులు కనిపించాలని ఉద్దేశంతో పనులు శరవేగంగా పూర్తి చేయదలుచుకున్నామని అన్నారు. అయితే మన దగ్గర డబ్బులు లేవని, ఆలోచనలు మాత్రమే ఉన్నాయని, ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on November 19, 2024 10:30 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…