Political News

మిస్సింగ్ కేసుల రచ్చ పై పవన్ స్పందన

ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఏపీలో 30 వేలకు పైగా మహిళలు మిస్సయితే వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని మాటిచ్చామని, అన్న మాట ప్రకారమే మార్పు తెచ్చామని పవన్ చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలో 18 మంది మహిళలు, అమ్మాయిల మిస్సింగ్ కేసులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిష్కరించారని పవన్ చెప్పారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల పనితీరు పట్ల గర్వంగా ఉందన్నారు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్న హోం శాఖకు, టాస్క్ ఫోర్స్ పోలీసులను పవన్ అభినందించారు. సమాజంతోపాటు సోషల్ మీడియాలోనూ మహిళల రక్షణ కోసం పోలీసు డిపార్ట్ మెంట్ కు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని పవన్ చెప్పారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యర పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 2019-24 మధ్య ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులు 44685 మంది కాగా, వాటిలో 44022 మహిళలను వెతికి పట్టుకున్నారని లోక్ సభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ క్రమంలోనే పవన్ చేసిన 30 వేల మంది మిస్సింగ్ కామెంట్లు అవాస్తవమని పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు కౌంటర్ గా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా 30వేల మంది మహిళల మిస్సింగ్ కేసులపై ఈ విధంగా స్పందించారు. మరి, పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 19, 2024 5:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్ కి పోటీగా సోనూసూద్ – చిరంజీవి రియాక్షన్

గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…

2 hours ago

జపాన్ వెళ్తున్న దేవర….రచ్చ గెలుస్తాడా ?

సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…

2 hours ago

స్మార్ట్ ప్రమోషన్లతో వెంకటేష్ ముందంజ!!

బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…

3 hours ago

అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం? : సిఎం రేవంత్!

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…

7 hours ago

సత్యం సుందరం దర్శకుడి వింత అనుభవం!

ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…

7 hours ago

ఆ రోజు మాట్లాడతా – జానీ మాస్టర్!

కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…

7 hours ago