ఏపీ శాసన మండలి బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే.. ప్రధానంగా వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ వివాదం రచ్చగా మారింది. ఇటు ప్రభుత్వం పక్షాన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్యాలెస్ నిర్మాణం విషయంపై నిప్పులు చెరిగారు. ఇదేసమయంలో అటువైపు వైసీపీ సభ్యులు ఈ వ్యవహారంపై చర్చను నిరసిస్తూ.. సభలో ఆందోళన చేపట్టారు.
మండలిలో స్వతంత్ర అభ్యర్థి ఒకరు.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణాన్ని ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. “రుషికొండ ప్యాలెస్ విషయంలో వైసీపీ అందరినీ మోసం చేసింది. ఇక్కడ రిసార్టులు కడుతున్నామని ప్రజలను నమ్మించి.. ఏడు బ్లాకులుగా విభజించి ప్రజాధనంతోప్యాలెస్‌ను నిర్మించింది. అద్భుతమైన ప్రపంచ స్థాయి రిసార్టు కడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి కోసం ప్యాలెస్ నిర్మించడం ప్రజాధనం దుర్వినియోగం కాదా?” అని దుర్గేష్ నిలదీశారు.
దీనిని ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై అందరితోనూ చర్చిస్తున్నట్టు మంత్రి కందుల తెలిపారు. ప్యాలెస్ నిర్మించిన వైసీపీ స్థానికంగా ఉన్న.. రిసార్టులను ఆదాయానికి దూరం చేసిందన్నారు. హరిత రిసార్ట్ ఒకప్పుడు మంచి ఆదాయంలో ఉండేదని.. కానీ వైసీపీ హయాంలో అప్పులు చేయాల్సిన పరిస్థితికి దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ప్రజలను మోసగించిన వారిపై కేసులు పెట్టాలని అన్నారు.
రుషి కొండ నిర్మాణాలను చూస్తే.. నోరు వెళ్లబెట్టాల్సిందేనని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఒకవైపు అప్పులు చేస్తూ..రాష్ట్రాన్ని దివాలా తీయించిన అప్పటి ముఖ్యమంత్రి.. రుషికొండను ధ్వంసం చేశారని, కనీసంఅక్కడ ఏం జరుగుతోందో చూసేందుకు కూడా ఎవరినీ అనుమతించలేదన్నారు. వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా రుషి కొండపై ఏం జరుగుతోందో చూసేందుకు అనుమతి ఇచ్చి ఉండరని వ్యాఖ్యానించారు. కళ్ల ముందే ఇంత దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.
This post was last modified on November 19, 2024 1:58 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…