వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై పోసాని అసభ్యకరరీతిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై ఇప్పటికే పలు కేసులు నమోదవగా తాజాగా పోసాని కృష్ణ మురళిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారానికి దిగారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోసానిపై రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని వ్యాఖ్యానించారని, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యానించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ కోరారు. దీంతో, పోసానిపై 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
కాగా, చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పవన్, లోకేష్ ల గురించి చేసిన వ్యాఖ్యలకుగానూ కడప జిల్లా రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గురించి పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్‌లలో టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. అనంతపురం, బాపట్ల, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి ,కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఆయనపై ఫిర్యాదులు అందాయి.
This post was last modified on November 18, 2024 5:55 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…