ప్రజాయుద్ధ నౌక.. ప్రముఖ గాయకుడు గద్దర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇచ్చింది. గద్దర్ కుమార్తె, విద్యావంతురాలు వెన్నెలను నామినేటెడ్ పోస్టులో నియమించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్‌గా వెన్నెలను నియమిస్తూ.. సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, వర్కు షాపులు, అభివృద్ది, సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి వేదిక ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తారు. దీనికి వెన్నెల సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా గద్దర్ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 2023లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్‌ను వెన్నెలకు కేటాయించింది. అయితే.. ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత.. కూడా ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించారు.
కానీ, పార్టీలోనే సంఖ్యాబలం ఉండడంతో అవకాశం లభించలేదు. ఇక, ఇప్పుడు వెన్నెలకు మరో రూపంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవిని ఇవ్వడం గమనార్హం. ప్రజా గాయకుడిగా.. గుర్తింపు పొందిన గద్దర్ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కూడా యాక్టివిస్టుగా పనిచేసిన గద్దర్.. అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నా రు. పలు సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లారు. అయితే.. ఎక్కడా దారి తప్పకుండా తాను ఎంచుకున్న ప్రజాబాటలోనే గద్దర్ ప్రయాణం ముందుకు సాగింది.
ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నగద్దర్.. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత.. రాజకీయంగా అడుగులు వేయాలని భావించినా.. ఇతర కారణాలతో ఆయన ఆదిశగా ప్రయాణం చేయలేక పోయారు. కేఏ పాల్ పార్టీ తరఫున ఉప పోరులో పోటీచేయాలని ప్రయత్నించారు. కానీ, మరికొన్ని కారణాలతో దీనిని కూడా విరమించుకున్నారు. గద్దర్ మరణం అనంతరం ఆయన కుమార్తె వెన్నెల రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఉన్నారు.
This post was last modified on November 18, 2024 4:33 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…